Perni Nani: పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటిస్...! 5 d ago
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం గోదాములలో తగ్గటంపై అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రేషన్ బియ్యం తగ్గటం పై 2 దఫాలుగా రూ. 1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈనెల 13న రూ. కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుతలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు.